AP POLYCET Results 2023 Latest update: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల – మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

AP POLYCET Results 2023

AP POLYCET Results Updates: ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్. రిజల్ట్స్ ను polycetap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

AP POLYCET Results ప్రధానాంశాలు:

  • AP POLYCET Results 2023 ఏపీ పాలిసెట్‌ 2023 ప్రవేశ పరీక్ష
  • ఈ ఏడాది 1,43,625 మంది హాజరు
  • AP POLYCET Results 2023 మే 20న ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు

AP POLYCET Results 2023 Updates:ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం 10.45 నిమిషాలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. https://polycetap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు.

ఏపీ పాలిసెట్-2023 ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10.45 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూలు సైతం నేడు ప్రకటించనున్నారు. ఏపీలో మే 10న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,43,625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

AP POLYCET Results 2023 రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు మాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు.

AP POLYCET Results 2023 ఇలా చెక్ చేసుకోవచ్చు..

  • అభ్యర్థులు మొదటగా https://polycetap.nic.in సైట్ లోకి వెళ్లాలి.
  • AP POLYCET Results 2023 పాలిసెట్ ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బట్ నొక్కిన తర్వాత మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం.

రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగినై AP POLYCET Results 2023 ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. AP POLYCET Results 2023 ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా – గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రములలో పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రవేశాలు కల్పించే సంస్థలు: పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

డిప్లొమా కోర్సులు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

AP POLYCET Results 2023

AP POLYCET Results 2023
AP POLYCET Results 2023

NOTE: మనబడి వెబ్ సైట్ http://www.manabadi.co.in/sourceview/POLYCET/Results/results-list లింక్ పై క్లిక్ చేసి మీ ర్యాంక్ తెలుసుకోవచ్చు.

TS POLYCET Results 2023: రాష్ట్రవ్యాప్తంగా మే 17వ తేదీన తెలంగాణ పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది సాంకేతిక విద్యా మండలి. ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ఇస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.94శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది.

పాలిసెట్ ఫలితాల్లో అర్హత సాధించి వారు రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు.

AP POLYCET Results 2023 ప్రాసెస్ ఇదే…..

  1. విద్యార్థులు మొదటగా https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డు అవసరం.

For more Details click here: https://telanganaschool.com/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *