TS CPGET 2023: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS CPGET) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సోమవారం విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో వివిధ PG (MA, MSc, MCom) కోర్సులు, PG డిప్లొమా కోర్సులు మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో (MA, MSc, MBA) ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలు (CPGET) 2023 నిర్వహిస్తుంది. పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS CPGET 2023) నోటిఫికేషన్‌ను నేడు ఓయూ విడుదల చేసింది.
For more details at : https://telanganaschool.com/
TS CPGET 2023:
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS CPGET 2023) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సోమవారం విడుదల చేశారు.
- ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.దీనికి మే 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
- ఆన్‌లైన్‌లో జూన్ 11 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుం రూ.500లతో జూన్ 18 వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు.
- జూన్ 20 వరకు ఆలస్య రుసుం రూ.1000లతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ చివరి వారం నుంచి సీపీగెట్ పరీక్షలు జరగనున్నాయి.
- ఈ యూనివర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
- 2023-2024 విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ , మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన మరియు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి.
- ఈ 8 విశ్వవిద్యాలయాల పరిధిలోని 320 కళాశాలల్లోని 50 కోర్సుల్లో 44,604 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఏ సబ్జెక్టులో డిగ్రీ చదివిన వారైనా.. సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కోర్సుల్లో పీజీ చేసేలా గత ఏడాది నిబంధనలు సవరించారు.
- ఈ సంవత్సరంలో కూడా కొన్ని మార్పులు చేశారు. బీటెక్, ఎంబీబీఎస్ అర్హత ఉన్న వాళ్లు కూడా ఎంకామ్ చేసేందుకు అనుమతి ఉండనుంది. అంతే కాకుండా.. బీకాం చదివిన విద్యార్థులతో పాటు.. ఏ డిగ్రీ చదివిన వారికైనా ఎంకామ్ చేసేందుకు ఈ సారి నిబంధనలు సవిరించారు.
- పూర్తి వివరాలకుhttp://www.ouadmissions.com/doa/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

TS CPGET 2023 (సీపీజీఈటీ) పూర్తి వివరాలు:
పరీక్ష పరిధిలోకి వచ్చే యూనివర్సిటీలు : ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.
TS CPGET 2023 దరఖాస్తుల సమర్పణ :
జరిమానా లేకుండా ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు.
- ఫీజు : ఓసీ, బీసీలకు రూ.800
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600
- ఇతర ప్రతి అదనపు సబ్జెక్టుకి రూ.400.
ఈ నెల 12 నుంచి జూన్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో జూన్ 20 వరకు ఫీజు చెల్లించవచ్చని సీపీగెట్ కన్వీనర్ తెలిపారు. సీపీగెట్ పరీక్ష జూన్ ఆఖరివారంలో జరుగనున్నది. ఈ యూనివర్సిటీల్లోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్‌తో భర్తీ చేయనున్నది. పూర్తి వివరాల కోసం osmania.ac.in, cpget.tsche.ac.in, ouadmissions.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి కోరారు.
For more details at : https://telanganaschool.com/