ఈ మధ్యకాలంలో జుట్టురాలడం, చుండ్రు వంటి పలు రకాల జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక ఈ సమస్యల నుంచి బయటపడేందుకు నేటి యువత నానా రకాల షాంపూలు, ట్రీట్‌మెంట్స్ తీసుకుంటున్నారు. అయితే అవేమి అవసరం లేకుండా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు. వారి సూచనల ప్రకారం కొన్ని రకాల ఆహారాలను, విత్తనాలను తీసుకుంటే చాలు. జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అంది, సమస్యలు దూరమవుతాయి. మరి జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకోవలసిన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..
పొద్దుతిరుగుడు విత్తనాలు: కేశసమస్యలకు చెక్ పెట్టడంలో పొద్దుతిరుగుడు విత్తనాలు మెరుగ్గా పనిచేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే గామా-లినోలెనిక్ అనే యాసిడ్ జుట్టురాలే సమస్య నుంచి త్వరగా ఉపశమనం కల్పిస్తుంది. అంతేకాకుండా కుదుళ్లను బలంగా తయారుచేసి, లోపలి నుంచి జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.