హృదయం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే వ్యాయామం చేయాలి.. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారు
ఆకు కూరలు: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బెర్రీలు: రోజూ బెర్రీలు తినడం వల్ల మీ గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
వాల్నట్: వాల్‌నట్స్‌లో ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. మీరు వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకుంటే.. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు
టొమాటో: టమోటోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి గుండెను రక్షిస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు ప్రతిరోజూ టమోటాలు తినవచ్చు.
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన వాల్ నట్స్ తింటే మంచిది. దీంతో గుండె జబ్బులు తగ్గుతాయి.
గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్, రక్తపోటును కూడా నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
మరోవైపు తప్పుడు జీవనశైలిని అనుసరిస్తే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే మీరు మీ జీవనశైలి, ఆహారంపై శ్రద్ధ వహించాలి.