తెలంగాణ ఆత్మగౌరవ దీపిక, అస్తిత్వ వైభవానికి అద్భుతమైన ప్రతీక.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా నిర్మించిన కొత్త సచివాలయ భవనం
28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇంత ఎత్తైన, ఈ తరహా సచివాలయం దేశంలో ఎక్కడా లేదు.
సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్ పాస్‌లు జారీ చేయనున్నారు. 300 సిసి కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘాను ఏర్పాటు చేయనున్నారు.
కొత్త సెక్రెరియేట్ భవనాన్ని ఆరు అంతస్తులతో నిర్మించారు. సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఎసి కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌ను నెలకొల్పారు.
30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు, 24 లిఫ్ట్‌లను, అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నిల్వ ఉండేలా ట్యాంకులను ఏర్పాటు చేశారు.
ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది
సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించోచ్చు. ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్ గా పేర్కొంటారు.