White Hair Permanent Solution: చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్తీ డైట్ జుట్టు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ముఖ్యంగా ఆధునిక జీవనశైలిని అలవాటు చేసుకోకుండా ఉండాలి. తీవ్రమైన తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు అనేక హోం రెమెడీలను అనుసరించాలి. వీటిని పాటించడం వల్ల గ్రే హెయిర్ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

white hair permanent black
ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించడంలో ఆవు పాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని అందాల నిపుణులు అంటున్నారు. ఈ పాలను జుట్టుకు పట్టించి 25 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
- అలోవెరా జెల్ కూడా.. అలోవెరా జెల్ చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు తెల్ల జుట్టును త్వరగా నల్లగా మార్చుతాయి. ఇది జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఈ అలోవెరా జెల్ ను విరివిగా వాడాలి.
- నల్లమిరియాల గుణాలు తెల్ల జుట్టు ( white hair ) సమస్యను దూరం చేయగలవని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం నల్ల మిరియాల పొడిని తీసుకుని నీళ్లలో కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు సులభంగా నల్లగా మారుతుంది.
- తెల్లజుట్టు సులువుగా పోవాలంటే ఉల్లిపాయ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మీ జుట్టును మంచి నీళ్లతో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సులభంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఇంటి చిట్కాలను వాడాలి.
- తెల్ల ఉల్లిపాయలతో తయారుచేసిన మిశ్రమాన్ని జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు ( white hair ) సమస్యలు సులభంగా దూరమవుతాయి.
- ఎండిన మెంతి ఆకులను హెన్నాలో మిక్స్ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కావాల్సినంత కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత జుట్టుకు అప్లై చేసి ఆరబెట్టాలి. ఇలా 2 గంటలు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఇలా కలర్ చేసిన తర్వాత మరుసటి రోజు జుట్టుకు బాగా నూనె రాసుని షాంపూతో తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు.

white Hair Home Remedies
సహజంగా తెల్ల జుట్టు 40 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. కానీ చాలామందికి 20 ఏళ్ల నుంచే తెల్ల జుట్టు(white hair) వచ్చేస్తోంది. దాని వల్ల చాలామంది చిన్న వయస్సులోనే పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. అన్నయ్య, అక్క అనిపించుకోవలసిన వయస్సులో అంకుల్, ఆంటీ అని పిలిపించుకుంటున్నారు. అంతేకాదు, తెల్ల జుట్టు (white hair) వల్ల నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిపడుతున్నారు. మారుతున్న జీవన విధానం, ఒత్తిడి, ఆహారంలో మార్పులు, దూమపానం వంటి చెడు అలవాట్లు.. జుట్టు త్వరగా తెల్లబడటానికి ప్రధాన కారణాలు.
శరీరంలో తగినంత మెలనిన్ ఉత్పత్తి జరగకపోతే జుట్టు తెల్లగా మారిపోతుంది. విపరీతమైన మానసిక ఆందోళన, వంశపారపర్యంగా కూడా జుట్టు నెరిసే అవకాశం ఉంది. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం వల్ల వాటిని కనిపించకుండా చెయ్యడం కోసం కొందరు మార్కెట్లో దొరికే అనేక ఆయిల్స్, క్రీములు, హెయిర్ డైలు వాడుతున్నారు. వాటి వల్ల జుట్టుకి కొద్ది రోజుల పాటు నలుపు వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఒక వారం తర్వాత మళ్ళీ తెల్ల జుట్టు (white hair) బయటపడి ఇబ్బందిగా మారుతుంది. అలా కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే సహజంగా జుట్టు నల్లబడేలా చేసుకోవవచ్చు. అవేంటో చూసేయండి మరి.

ఉసిరి
కేశాల సంరక్షణకి ఉసిరి చాలా మంచిది. సహజంగా జుట్టు పెరుగుదల, అందంగా ఉండేందుకు జుట్టు రంగు కోల్పోకుండా చేసేందుకు ఉసిరి మంచిగా సహాయపడుతుంది. ఉసిరికాయ నుంచి విత్తనాలు వేరు చెయ్యాలి. తర్వాత ఆ ఉసిరిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తల మాడుకు, జుట్టు మొదళ్ళకి బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు రాలే సమస్యతో పాటు తెల్ల జుట్టు(white hair) నలుపు రంగులోకి మారుతుంది. ఉసిరి ఆకులను కూడా మెత్తగా రుబ్బుకుని పేస్ట్ లాగా చేసుకుని తలకి పట్టించుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది.
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలుపుకొని తలకు రాసుకోవడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నూనెలో ఉండే బయోటిన్ తెల్ల జుట్టుని నయం చెయ్యడంలో సహాయపడతాయి. అంతే కాదు జుట్టు మృదువుగా మారేందుకు ఇది దోహదపడుతుంది.
ఎలా చెయ్యాలి: కొద్దిగా కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడుకి, జుట్టుకి బాగా పట్టే విధంగా రాసుకుని మర్దన చెయ్యాలి.
కరివేపాకు
కరివేపాకు కంటికే కాదండోయ్ జుట్టు సంరక్షణకి మంచిగా ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్ళను బలపరిచి కేశాలు అందంగా కనిపించేలా చేస్తుంది.
ఎలా చెయ్యాలి: ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి వాటిని బాగా ఉడికించాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టి తలకి రాసుకుని మర్దన చేసుకోవాలి. దాన్ని జుట్టుకు కనీసం 30-45 నిమిషాల వరకు తలకి పెట్టుకుని ఉండాలి. కనీసం వారానికి రెండు సార్లు ఇలా చెయ్యడం వల్ల తెల్ల జుట్టు (white hair)సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.
టీ లేదా కాఫీ పొడి
వాటితో టీ లేదా కాఫీ చేసుకుని తాగితే బాగుంటుంది. కానీ, తలకి ఎందుకు అని అనుకుంటున్నారా? తెల్ల జుట్టు(white hair) సమస్యకి ఇవి చాలా బాగా పని చేస్తాయంట. కాఫీ పొడి లేదా టీ పొడిని నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. జుట్టుకి ఉన్న సహజమైన రంగుని కాపాడేందుకు టీ పొడిని బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రంగు మారేందుకు కాఫీ పొడిని తలకి అప్లై చేసుకోవచ్చు.
నల్ల నువ్వులు
తెల్ల జుట్టును సహజమైన నలుపు రంగులోకి మార్చేందుకు నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. పచ్చి నల్ల నువ్వులను రోజు ఖాళీ కడుపుతో తినడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్
ఇందులో రాగి పుష్కలంగా ఉంది. జుట్టుకి మంచి రంగు ఇచ్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో దీని బాటిల్స్ దొరుకుతాయి. ప్రతి రోజు రోజు ఉదయాన్నే కొన్ని నెలల పాటు దీన్ని ఒక టేబుల్ స్పూన్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ పేస్ట్
ఇది జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది. ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ చేసుకుని తలకి అప్లై చేసుకోవాలి. ఒక గంట తర్వాత దాన్ని కడిగేయాలి. ఇలా చెయ్యడం వల్ల క్రమంగా తెలుపు రంగులో ఉన్న జుట్టు నలుపు రంగులోకి మారుతుంది.
రోజ్మెరి, సేజ్
ఎండిన రోజ్మెరి మొక్క ఆకులు, సేజ్ మొక్క ఆకును ఒక రెండు కప్పుల నీటిలో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని తలకి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత దాన్ని శుభ్రంగా కడగాలి. వారం వారం ఇలా చెయ్యడం వల్ల తెల్ల జుట్టుని నివారించవచ్చు.
కుంకుడు కాయలు
తెల్ల జుట్టు(white hair)ని నివారించేందుకు అద్భుతమైన రెమిడీ కుంకుడు కాయ. రాత్రి పూట ఇనుప పాత్రలో కుంకుడు కాయలు వేసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఉదయం వీటిని మరిగించి తలకి పట్టించాలి. క్రమం తప్పకుండా ఇలా చెయ్యడం వల్ల జుట్టుకి మంచి రంగు వస్తుంది.
FOR MORE TIPS CLICK HERE: https://telanganaschool.com/